ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పనులు సరే..భౌతిక దూరం ఏది?

విజయనగరం జిల్లా సాలూరులో ప్రజలు భౌతిక దూరం మరచి వారి పనుల కోసం ప్రభుత్వ కార్యాలయం, బ్యాంకు, ఆధార్​ కేంద్రాల వద్ద గుమిగూడారు. కొందరు కనీసం మాస్కులు కూడా పెట్టుకోకుండా ప్రభుత్వ నిబంధనలు పెడచెవిన పెడుతూ కార్యాలయాల వద్ద నిల్చున్నారు.

saluru people does not obey the covid rules
సాలూరు ప్రభుత్వ కార్యాలయాల వద్ద గుమిగూడిన ప్రజలు

By

Published : Jul 6, 2020, 3:06 PM IST

ఓ పక్క కరోనా వైరస్​ విజృంభిస్తుంటే... విజయనగరం జిల్లా సాలూరులో చాలామంది ఇవేం పట్టించుకోకుండా బ్యాంకు, తహసీల్దారు కార్యాలయం, ఆధార్​ కేంద్రం వద్ద బారులు తీరారు. భౌతిక దూరాన్ని పాటించకుండా నిబంధనలు మరిచి ప్రభుత్వ కార్యాలయాల దగ్గరకు చేరుకున్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించేందుకు, ఆధార్​ కార్డులోని మార్పులు చేసుకునేందుకు.. కొత్త రేషన్​ కార్డుల కోసం ఇలా అనేక కారణాలతో పలువురు ఆఫీసుల వద్దకు వచ్చారు. అయితే కొందరు కనీసం మాస్కులు కూడా పెట్టుకోకపోవడంతో చాలామంది భయాందోళనలకు గురవుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details