ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయనగరం జిల్లాలోనే ఆర్టీసీ బస్సులు?

రాష్ట్రంలో గ్రీన్​జోన్​లో ఉన్న విజయనగరం జిల్లాలో ఆర్టీసీ బస్సులు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే బస్సు సీట్ల సామర్థ్యంలో సగం మందికే అనుమతినిస్తారు.

By

Published : May 3, 2020, 10:22 AM IST

RTC buses are available in the Vijayanagaram district in the Green Zone following the central government guidelines.
విజయనగరం జిల్లాలోనే ఆర్టీసీ బస్సులు?

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల నేపథ్యంలో గ్రీన్‌జోన్‌లో ఉన్న విజయనగరం జిల్లాలోనే ఆర్టీసీ బస్సులు నడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో పలు నిబంధనలు అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.

బస్సుల్లో సగం మందే.. మాస్కు తప్పనిసరి

* విజయనగరం జిల్లా అంతటా కొన్ని బస్సులు నడుపుతారు. రెడ్‌జోన్‌లో ఉన్న విశాఖ, ఆరెంజ్‌ జోన్‌లో ఉన్న శ్రీకాకుళం జిల్లాలకూ బస్సులు వెళ్లవు. విజయనగరం- విశాఖ మధ్య నిత్యం 150 వరకు సర్వీసులు తిరిగేవి. ఇప్పుడవి తిరగవు.

* పాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌ బస్సులు నడపనుండగా, వీటి సీట్ల సామర్థ్యంలో సగం మందినే అనుమతిస్తారు. ఒక బస్సు వెడల్పు రెండు మీటర్లు ఉంటుంది. అందుకే ఒక వరుసలో చెరో కిటికీవైపు తలొకరు, మధ్యలో ఒకరు కూర్చోవచ్చు.

* ప్రస్తుతానికి కండక్టర్‌ లేకుండా డ్రైవర్లతోనే బస్సులు నడుస్తాయి. కండక్టర్‌ ప్రయాణికుల మధ్య తిరుగుతూ టికెట్లు ఇస్తే వైరస్‌ ప్రభావానికి గురయ్యే ప్రమాదం ఉందని ఈ నిర్ణయం తీసుకోనున్నారు.

* బస్టాండ్లు, ముఖ్యమైన పాయింట్లలో ఆర్టీసీ సిబ్బంది ఉండి టికెట్లు విక్రయిస్తారు. ప్రయాణికులు వాటిని కొని బస్సు ఎక్కాలి.

* మాస్కు లేనివారిని బస్సులోకి అనుమతించరు.

ఇవీ చదవండి...కరోనా కాలంలో.. ఆమె సేవలు అసాధారణం

ABOUT THE AUTHOR

...view details