విజయనగరం జిల్లా పార్వతీపురం రామానంద్ నగర్లోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. బంగారం, వెండి, నగదును దొంగలు అపహరించారు. కొమరాడ మండలం పరశురాంపురానికి చెందిన అధికారి రాజశేఖర్ దంపతులు రామానంద్ నగర్లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. సొంత పనులపై కొద్ది రోజుల క్రితం ఊరెళ్లారు. బుధవారం మధ్యాహ్నం కుటుంబీకులు వచ్చి చూడగా దొంగతనం జరిగినట్లు గుర్తించారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించినట్లు బాధితులు తెలిపారు. సీఐ దాశరథి, ఎస్ఐ కళాధర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం వేలిముద్రల సేకరణ చేపట్టింది. సుమారు మూడు తులాల బంగారం, 60 తులాల వెండి, రూ. 75 వేల నగదును దొంగలు పట్టుకెళ్లారని బాధితులు ఫిర్యాదు చేశారు.
ఊరెళ్లి వచ్చేసరికి ఇళ్లంతా దోచేశారు
పార్వతీపురంలోని ఓ కాలనీలో దొంగలు పడ్డారు. ఊరి నుంచి తిరిగి వచ్చే సరికి ఇంట్లో వస్తువులు ఎత్తుకెళ్లారని బాధితులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రామానంద్నగర్లో చోరీ... బంగారం, వెండి ఆభరణాలు అపహరణ