విజయనగరం జిల్లా గిరిశిఖర గ్రామాల్లోని ప్రధాన రహదారులు గుంతల మయంగా తయారయ్యాయి. రోడ్డు వేసిన రెండేళ్లకే పాడవడంతో నాణ్యతపై ప్రజలంతా పెదవి విరుస్తున్నారు. కిలోమీటర్ పొడవున్న రోడ్డుపై అడుగడుగున గోతులు దర్శనమిస్తున్నాయి. వర్షం పడితే గోతుల్లో నీరు చేరడంతో ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నారనీ గ్రామస్థులు వాపోతున్నారు. సంబంధిత శాఖాధికారులు త్వరగా చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నారు.
పాడైన రహదారులు ...ఆసుపత్రిపాలవుతున్న ప్రజలు - విజయనగరం జిల్లా
రోడ్లువేసి రెండేళ్లైనా కాలేదు... ఇంతలోనే గుతుకులు...చిన్నపాటి వర్షాలకే బురదతో దర్శనిమిస్తున్నాయి. ఇదీ విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో గిరిశిఖర గ్రామాల్లోని రహదారుల దుస్థితి.
పాడైన రోడ్లు... ఇబ్బందుల పడుతున్న ప్రజలు