విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలోని వైటీసీ వసతి గృహంలో నీటి సమస్యతో గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై.. 'నీటి సమస్యను అరికట్టాలని గర్భిణుల ఆందోళన' పేరుతో ఈటీవీ భారత్ కథనం వెలువరించింది.
స్పందించిన ఐటీడీఏ పీవో కూర్మనాథ్.. వెంటనే సమస్య పరిష్కారానికి ఏర్పాట్లు చేశారు. వసతి గృహంలో నీటి వసతి కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యురాలు, మాజీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి సైతం వసతి గృహంలో ఉన్న వారితో, అధికారులతో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి కారణమైన ఈటీవీభారత్కు గర్భిణులు ధన్యవాదాలు తెలిపారు.