విజయనగరం జిల్లాలో 18వేల హెక్టార్లలో మెుక్కజొన్న పంటను సాగుచేస్తున్నారు రైతులు. చీపురుపల్లి, మెురకముడిదం, గరివిడి, గుర్ల, నెల్లిమర్ల మండలాల్లోనే ఈ పంటను 9వేల హెక్టార్లలో పండిస్తారు. కరోనా వైరస్ కారణంగా మెుక్కజొన్న ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. క్వింటాల్ ధర 2200 నుంచి 1200 రూపాయలకు తగ్గిపోయింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
కరోనా ప్రభావం: తగ్గిన మెుక్కజొన్న ధర - Reduced maize price under corona effect
కరోనా వైరస్ ప్రభావం మెుక్కజొన్న రైతులపై పడింది. దీని కారణంగా మెుక్కజొన్న ఎగుమతులు పెద్ద ఎత్తున నిలిచిపోయి... ధర తగ్గింది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరారు.
జిల్లాలో ఎక్కువ మంది మెుక్కజొన్న పంటపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇక్కడి నుంచి కోళ్ల మేత కోసం ఎక్కువగా మెుక్కజోన్నలు కొంటారు. కరోనా వైరస్ కారణంగా పౌల్ట్రీ పరిశ్రమ పూర్తిగా దెబ్బతింది. ఒక్కసారిగా ధర తగ్గింది. ప్రభుత్వం స్పందించి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయంపై కలెక్టర్కు నివేదిక పంపించామని అగ్రికల్చర్ ఏడీ ఎన్వీ వేణుగోపాలరావు తెలిపారు. ఎవరు ఇబ్బంది పడొద్దని... ప్రభుత్వమే నేరుగా రైతుల దగ్గరకు వెళ్లి కొనేందుకు తగిన ఏర్పాట్లు చేస్తుందని చెప్పారు.
ఇవీ చదవండి...కుప్పంలో 80 ఏళ్ల వృద్ధుడికి కరోనా లక్షణాలు!