పార్వతీపురం వైకాపా సమావేశంలో రసాభాస - ఏపీలో స్థానిక పోరు వార్తలు
విజయనగరం జిల్లా పార్వతీపురంలో జరిగిన వైకాపా సమావేశం రసాభాసగా మారింది. పార్టీని నమ్ముకుని పనిచేసిన వారికి కాకుండా వేరే వారికి టిక్కెట్లు ఇవ్వడంపై మహిళలు నాయకులను నిలదీశారు. అరకు పార్లమెంట్ వైకాపా అధ్యక్షుడు పరీక్షిత్ రాజు, ఎమ్మెల్యే జోగారావు ఎదుటే నిరసన తెలిపారు. సమావేశంలో గందరగోళం నెలకొనడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను బయటకు పంపారు.
rasabhasa at parvatipuram ycp meeting over local body election tickets