ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాలికపై ఇద్దరు యువకుల సామూహిక అత్యాచారం - vizayanagaram

ఓ బాలిక...ఆవులు మేపుతూ ఆడుకుంటోంది. ఇంతలో అటుగా ఇద్దరు యువకులు వచ్చారు. బాలికను చూసి ఎలాగైనా లొంగదీసుకోవాలని ప్రయత్నించారు. వద్దు వద్దు అంటున్నా ఆ కీచకులు బాలిక పై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధను దిగమింగుకొని బోరుమంటూ ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో విషయం చెప్పింది. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది.

rape-attempt-on-minor-girl

By

Published : Jun 25, 2019, 9:00 AM IST

బాలికపై ఇద్దరు యువకుల సామూహిక అత్యాచారం

విజయనగరం జిల్లా గుర్ల మండలంలో ఓ బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల18న ఓ రిజర్వాయర్‌ వద్ద ఆవులు మేపుతున్న బాలికను... కొర్ణాల ఆనంద్‌, కొర్ణాల నాగరాజు అనే యవకులు అత్యాచారం చేసినట్లు బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు నాగరాజు.... ఈ ఘటనను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడని, అత్యాచారం గురించి బయటకు చెబితే ఆ దృశ్యాలను ఇంటర్‌నెట్‌లో విడుదల చేస్తానని బాధితురాలిని బెదిరిస్తున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details