అన్న క్యాంటీన్లను తక్షణమే తెరవాలని కోరుతూ విజయనగరం జిల్లా పార్వతీపురంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ధర్నా కు దిగారు. మూసివేసిన క్యాంటీన్ వద్ద నినాదాలు చేస్తూ,సంతకాల సేకరణ నిరసన చెపట్టగా మంచి స్పందన లభించింది. ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, తెదేపా పట్టణ అధ్యక్షుడు కె. వెంకట్ రావు ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు.
బొబ్బిలిలో అన్న క్యాంటీన్ల పై నిరసన కొనసాగింది. మాజీమంత్రి సుజయ్ కృష్ణ రంగారావు ఆధ్వర్యంలో బొబ్బిలి కోట నుంచి అన్న క్యాంటీన్ వరకు ర్యాలీ నిర్వహించారు. పురపాలక కమిషనర్ నాయుడుకు వినతి పత్రం అందజేశారు.