బాధ్యతలు స్వీకరించిన జిల్లా ఎస్పీ రాజకుమారి - vijayanagaram
విజయనగరంజిల్లా ఎస్పీగా రాజకుమారి బాధ్యతలు స్వీకరించారు. నూతన ఎస్పీకి అదనపు ఎస్పీ నరసింహారావు ఆధ్వర్యంలో పలువురు అధికారులు, కార్యాలయ సిబ్బంది సాదర స్వాగతం పలికారు.
విజయనగరంజిల్లా ఎస్పీగా రాజకుమారి బాధ్యతలు స్వీకరించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సాధారణ బదిలీల్లో భాగంగా ఇప్పటివరకు జిల్లా ఎస్పీగా విధుల్లో ఉన్న ఏఆర్ దామోదర్ బదిలీ కాగా., ఆయన స్థానంలో రాజకుమారి నియమితులయ్యారు. నూతన ఎస్పీకి అదనపు ఎస్పీ నరసింహారావు ఆధ్వర్యంలో పలు అధికారులు, కార్యాలయ సిబ్బంది సాదర స్వాగతం పలికారు. అనతరం ఎస్పీ మీడియాతో మాట్లాడారు.జిల్లా శాంతి భద్రతలని కాపాడడంలో ప్రాధాన్యత ఇస్తున్నామని, మహిళలు, పిల్లలకి నేరాలు పట్ల అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలియచేశారు..