విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి రైల్వే స్టేషన్లో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. 4నియోజకవర్గాలకు చెందిన ప్రజలు ఈ స్టేషన్‌కు వచ్చే రైలు ఎక్కాల్సి ఉంటుంది. అయితే స్టేషన్లో ప్లాట్‌ఫాంలు మారాలంటే మాత్రం భయపడుతున్నారు ప్రజలు. రోజువారి కూలీలు, కాలేజీ విద్యార్థులు, సాధారణ ప్రయాణికులు, ఉద్యోగస్తులు రైల్వే ట్రాక్‌పై నుండే వేరే ప్లాట్‌ఫాంకు చేరుకోవాలి...దీంతో ప్రమాదవశాత్తు చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదిలా ఉండగా...రైల్లు సమయానికి రావకపోవడం, ఆగాల్సిన రైల్లు ఆల్ట్ అవ్వకపోవటం, స్టేషన్లో తాగునీటి సదుపాయం లేకపోవటంపై స్థానికులు...ఈ సమస్యలను వెంటనే తీర్చాలని ప్రభుత్వాన్నిు కోరుతున్నారు. ప్లాట్‌ఫాంలను చేరుకోవడానికి తక్షణమే ఫుట్ఓవర్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
అసౌకర్యాల నిలయంగా...చీపురుపల్లి రైల్వే స్టేషన్ - vijayanagaram
విజయనగరం జిల్లా రైల్వే స్టేషన్ తర్వాత అతిపెద్దదైన చీపురుపల్లి రైల్వే స్టేషన్ అసౌకర్యాలకు నిలయంగా మారింది. చీపురుపల్లి రైల్వే స్టేషన్ రోజు కొన్ని వేల మందిని తమ తమ మార్గాలకు చేరుస్తూ ఉంటుంది. కానీ, ఇక్కడ ప్లాట్‌ఫాంలు మారాలంటే మాత్రం సాహసమే చేయాల్సి వస్తుందని వాపోతున్నారు స్థానికులు.
అసౌకర్యాల నిలయంగా రైల్వే ప్రాంగణం