విజయనగరం జిల్లా పార్వతీపురం రైల్వే స్టేషన్ సమీపంలో శంకరరావు అనే వ్యక్తి రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. కుటుంబసభ్యలు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం పేద కంబర గ్రామానికి చెందిన శంకరరావు బంధువుల ఇంటికి రాయగడ వెళుతూ..... ప్రమాదానికి గురై కన్నుమూశారు. వృద్ధాప్యంలో తోడుటుండానుకున్న కుమారుడు ఇక లేడు అన్న నిజాన్ని తల్లిదండ్రులు సరోజనమ్మ, సింహాచలం జీర్ణించుకోలేకపోతున్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదవశాత్తూ...రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి - శంకరరావు
రైలునుంచి ప్రమాదవశాత్తూ...కిందపడి ఓ వ్యక్తి చనిపోయిన ఘటన విజయనగరం జిల్లా పార్వతీపురంలో చోటుచేసుకుంది.
మృతిచెందిన శంకరరావు