విజయనగరం జిల్లా పార్వతీపురంలోని జగన్నాథ స్వామి ఆలయంలో స్నాన పౌర్ణమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్ర దేవికి వేద పండితులు ప్రత్యేక పూజలు జరిపించారు. ఆలయంలోకి తక్కువ మంది భక్తులను అనుమతించారు. భక్తులు భౌతిక దూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. శాస్త్రోక్తంగా వేద పండితులు పూజాది కార్యక్రమాలు జరిపించారు.
జగన్నాథ స్వామి ఆలయంలో స్నాన పౌర్ణమి ప్రత్యేక పూజలు - parvahipuram mandal latest news
స్నాన పౌర్ణమి సందర్భంగా జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రా దేవికి పార్వతీపురంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో పరిమిత సంఖ్యలో వేదపండితులు పాల్గొని భౌతికదూరం పాటిస్తూ కార్యక్రమం జరిపారు.
స్నాన పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు