పుస్తక పఠనంతో మానసిక వికాసం పొందొచ్చని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ తెలిపారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ఆయన ప్రారంభించారు. హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా స్వగ్రామానికి చేరుకున్న రాయ్‌ను మిత్రులు, శ్రేయోభిలాషులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ ఆవరణలో ఆయన మెుక్కలు నాటారు. పర్యవరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
పుస్తక పఠనంతో మానసికోల్లాసం: జస్టిస్ మానవేంద్రనాథ్ - vizatyanagaram
విజయనగరం జిల్లా పార్వతీపురంలోని ప్రకాశం టౌన్‌హాల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ప్రారంభించారు.
జస్టిస్ మానవేంద్రనాథ్