విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలో శ్రీ కోదండరామ స్వామి విగ్రహ ధ్వంసం ఘటనలో రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరిని నిరసిస్తూ 'భాజపా- జనసేన' సంయుక్తంగా రామతీర్థ ధర్మయాత్ర తలపెట్టాయి. దీనికి పోలీసు శాఖ నుంచి అనుమతులు సైతం పొందారు. అయితే జిల్లాలో శాంతిభద్రతలు, కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా రామతీర్థంలోని ఆలయ పరిసరాల్లో సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతులు లేవని జిల్లా ఎస్పీ రాజకుమారి సోమవారం ప్రకటన విడుదల చేశారు. ఎవరైనా చట్టాలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు ఆంక్షలు విధించినా ధర్మయాత్ర చేపట్టి తీరుతామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. ఈ క్రమంలో ఉత్కంఠ నెలకొంది.
వైకాపా సర్కార్ విఫలం