విజయనగరం, విశాఖ, శ్రీకాకుళంకు పిడుగు హెచ్చరికలు - నిర్వహణ
విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశమున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. ఈ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ పిడుగు హెచ్చరికలు జారీ చేసింది. విజయనగరం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, పార్వతీపురం, మక్కువ, సాలూరు, పాచిపెంట.. విశాఖ జిల్లాలోని ముంచింగిపుట్టు, డుంబ్రిగుడ, అరకువాలీల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం, పిడుగులు పడే అవకాశమున్నట్లు తెలిపింది. ఈ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలనీ.. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించింది.మూడు జిల్లాల్లోని అన్ని మండలాల్లో పిడుగులు, వర్షం కురిసే అవకాశమున్నట్లు తెలిపింది. కాసేపట్లో పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.విజయవాడ పరిసరాల్లో పెనుగాలులతో వర్షం, పిడుగులు పడతాయని తెలిపింది.