ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

food problem in hospitals: ప్రభుత్వ ఆసుపత్రుల్లో భోజన బాధలు.. ఇబ్బందుల్లో రోగులు..! - patients

problem of free food in hospitals: ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అందించే ఉచిత భోజనానికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారులు సరఫరా నిలిపివేశారు. విజయనగరం జిల్లాలోని పలు ఆసుపత్రుల్లో చేరుతున్న పేదలు..... ఆహారం అందక, బయట అధిక ధరకు కొనుక్కోలేక అవస్థలు పడుతున్నారు.

patients-facing-problems-with-free-meals-in-vijayanagaram-govt-hospitals
ప్రభుత్వ ఆసుపత్రుల్లో భోజన బాధలు.. ఇబ్బందుల్లో రోగులు..!

By

Published : Dec 7, 2021, 10:02 AM IST

ప్రభుత్వ ఆసుపత్రుల్లో భోజన బాధలు.. ఇబ్బందుల్లో రోగులు..!

patients facing food problem in hospitals: విజయనగరం జిల్లాలోని 11 సీహెచ్​సీలు, ఓ జిల్లా కేంద్ర ఆసుపత్రి, ఓ మాతాశిశు వైద్యశాలలో చేరే రోగుల కోసం ప్రభుత్వం ఉచిత భోజన సదుపాయం కల్పిస్తోంది. అయితే ఈ కార్యక్రమం అన్నిచోట్లా సక్రమంగా అమలు కావడం లేదు. జిల్లావ్యాప్తంగా కోట్లాది రూపాయల బిల్లులు గుత్తేదారులకు బకాయిలు ఉండటంతో వారు సరఫరా నిలిపివేశారు. చినమేరంగి, భోగాపురం, బొబ్బిలి, సాలూరు, చీపురుపల్లి, గుమ్మలక్ష్మీపురం, నెల్లిమర్ల.. ఇలా అన్నిచోట్లా బకాయిలు పేరుకుపోయాయి. విజయనగరంలోని కేంద్ర ఆసుపత్రి, మాతాశిశు ఆసుపత్రికే కలిపి రూ. 70లక్షలు చెల్లించాల్సి ఉంది.

జిల్లాలోని చాలా ఆసుపత్రుల్లో వైద్యులు, అధికారులే గుత్తేదారులను ఒప్పించి సరఫరా ఆగకుండా చూడటానికి ప్రయత్నిస్తున్నారు. భోజన సదుపాయం లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని రోగులు వాపోతున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో భోజన సదుపాయాన్ని క్రమబద్ధీకరిస్తే చాలా ఉపయుక్తంగా ఉంటుందని రోగులు అంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details