ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు - parvathipuram court life verdict nes

విజయనగరం జిల్లా పార్వతీపురం 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి కీలక తీర్పు వెలువరించారు. భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు.

భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు
భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు

By

Published : Nov 6, 2020, 10:41 PM IST

భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు విధిస్తూ.. విజయనగరం జిల్లా పార్వతీపురం 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. మక్కువ పోలీసు స్టేషను పరిధిలో 2019లో నమోదైన హత్య కేసులో నిందితుడు గెంబలి ఎరకయ్యకు శిక్షను ఖరారు చేశారు. మూలవలస గ్రామానికి చెందిన గెంబలి ఎరకయ్య... చిలకమ్మను మూడో వివాహం చేసుకున్నాడు. చెడు వ్యసనాలకు బానిసైన నిందితుడు.. డబ్బు విషయమై చిలకమ్మను వేధిస్తుండేవాడు.

ఈ క్రమంలో 2019 ఏఫ్రిల్ 28న డబ్బు విషయమై భార్యభర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. కోపోద్రేకుడైన ఎరుకయ్య కత్తితో భార్య మెడపై నరికి హత్య చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో అభియోగ పత్రాన్ని దాఖలు చేశారు. ఈ కేసులో దోషిగా నిరూపితం అయిన కారణంగా.. ఎరుకయ్యకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ నేడు తీర్పు వెలువడింది.

ABOUT THE AUTHOR

...view details