ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గిరిజనుల అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి: పుష్ప శ్రీవాణి

గిరిజనుల అభివృద్ధిపై సీఎం జగన్ చిత్తశుద్ధితో పని చేస్తున్నారని డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి అన్నారు. 14నెలల వైకాపా పాలనలో గిరిజనుల అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. ఐటీడీఏ ప్రాంతాల అభివృద్ధితో పాటు విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.

By

Published : Aug 9, 2020, 4:58 PM IST

Pamula Pushpa Sreevani
Pamula Pushpa Sreevani

గిరిజ‌నుల సంక్షేమానికి వైకాపా ప్ర‌భుత్వం పెద్ద‌పీట వేస్తోంద‌ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. 14నెలల పాలనలో గిరిజనుల కోసం ఎన్నో కార్యక్రమాలను చేపట్టామని చెప్పారు. పార్వతీపురంలోని ఏయూ క్యాంపస్ వద్ద రూ.కోటి 35 లక్షలతో నిర్మించిన గిరిజన సంక్షేమ భవనాన్ని...ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రారంభించారు.

తెదేపా పాలనలో నాలుగున్నరేళ్లు గిరిజన సంక్షేమశాఖను ఆ వర్గాలకు కేటాయించలేదని...కానీ వైకాపా ప్రభుత్వం తనని మంత్రివర్గంలోకి తీసుకోవడమే గాక ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారని పుష్ప శ్రీవాణి గుర్తు చేశారు. గిరిజనుల అభివృద్ధి పట్ల సీఎం జగన్​ చిత్తశుద్ధితో పని చేస్తున్నారని తెలిపారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details