కొత్తవలసలో కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్ నిలిపివేత.. ఒడిశా వాసి మృతి - కొత్తవలసలో నిలిచిన రైలు గుండెపోటుతో వ్యక్తి మృతి
12:24 June 18
గుండెజబ్బు చికిత్స కోసం ఒడిశా నుంచి విశాఖ వస్తున్న జోగేష్ బెహరా
Agnipath effect on trains: అగ్నిపథ్ ఆందోళనల నేపథ్యంలో అర్ధాంతరంగా రైలును నిలిపివేయటంతో ఓ ప్రాణం పోయింది. అత్యవసర చికిత్స కోసం విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ గుండె జబ్బు బాధితుడు మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా కొత్తవలసలో చోటు చేసుకుంది.
అగ్నిపథ్ నిరసనల నేపథ్యంలో కోర్బా నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన ఎక్స్‌ప్రెస్ రైలును రైల్వే అధికారులు విజయనగరం జిల్లా కొత్తవలసలో నిలిపివేశారు. అర్ధాంతరంగా రైలును నిలిపివేయటంతో ప్రయాణికులు విశాఖపట్నం చేరుకోడానికి బస్సులు, ఆటోలు ఆశ్రయించారు. ఈ క్రమంలో ఒడిశా రాష్ట్రం కలహండి జిల్లా నహుపాడకు చెందిన గుండెజబ్బు ఉన్న వ్యక్తి జోగేష్ బెహరా(75) తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అత్యవసరంగా విశాఖకు తరలించేందుకు స్థానికంగా ప్రైవేటు అంబులెన్సులు అందుబాటులో లేకపోవటంతో బాధితుడి కుటుంబ సభ్యులు కొత్తవలసలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స చేస్తుండగానే జోగేష్ బెహరా మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇవీ చదవండి:
TAGGED:
Vizianagaram latest updates