వారసులకు ప్రకృతిని ఆస్తిగా అందించే పరిస్థితి రావాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ రాష్ట్రస్థాయి కమిటీ ఛైర్మన్ జస్టిస్ శేషశయనారెడ్డి అన్నారు. విజయనగరం పర్యటనలో భాగంగా నగరపాలక సంస్థ పరిధిలోని గుణుపూరు, గ్రామీణ ప్రాంతాల్లో... ఘన వ్యర్ధాల నిర్వహణ కేంద్రాలను పరిశీలించారు. డంపింగ్ యార్డులను నిర్దేశిత ప్రమాణాలతో రూపొందించాల్సి ఉందన్నారు. తడి చెత్త, పొడి చెత్తను విడిగా సేకరిస్తున్నా మళ్లీ వాటిని డంపింగ్ యార్డులో కలపడం వల్ల ఆశించిన ప్రయోజనం రావడంలేదని పేర్కొన్నారు. ప్రకృతి సంపదను పరిరక్షించే బాధ్యత అందరిపైనా ఉందని చెప్పారు.
ప్రకృతిని ఆస్తిగా ఇవ్వాలి: జస్టిస్ శేషశయనారెడ్డి - dumping
విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని గుణుపూరు, గ్రామీణ ప్రాంతాల్లో... ఘన వ్యర్ధాల నిర్వహణ కేంద్రాలను జాతీయ హరిత ట్రైబ్యునల్ రాష్ట్రస్థాయి కమిటీ ఛైర్మన్ జస్టిస్ శేషశయనారెడ్డి పరిశీలించారు.
ఘన వ్యర్ధాల నిర్వహణ కేంద్రాలను పరిశీలిస్తున్న జస్టిస్ శేషశయనారెడ్డి