ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కురుపాం తెదేపా అభ్యర్థిగా నరసింహ ప్రియ - జనార్ధన్ థాట్రాజ్

విజయనగరం జిల్లా కురుపాం తెదేపా అభ్యర్థి  జనార్ధన్ థాట్రాజ్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. డమ్మీ నామినేషన్​ వేసిన థాట్రాజ్​ తల్లి తెదేపా నుంచి బరిలో ఉండనున్నారు.

జనార్ధన్ థాట్రాజ్

By

Published : Mar 26, 2019, 7:43 PM IST

Updated : Mar 27, 2019, 10:06 AM IST

విజయనగరం జిల్లా కురుపాం తెదేపా అభ్యర్థిగా జనార్ధన్​ థాట్రాజ్​ తల్లి నరసింహ ప్రియ బరిలో ఉండనున్నారు. ఇవాళ నామినేషన్ల పరిశీలనలో థాట్రాజ్​ నామపత్రం తిరస్కరణకు గురైంది.డమ్మీ నామినేషన్ వేసిననరసింహ ప్రియ నామినేషన్ అంగీకరించబడింది. థాట్రాజ్​ నామినేషన్​ తిరస్కరణకు గురి కావడం వలనతెదేపా బి-ఫారం​ ఆమెకు బదిలీ అవుతుంది.

అంతకుముందు థాట్రాజ్​ నామినేషన్​లోతప్పులు ఉన్నాయని భాజపా, కాంగ్రెస్ అభ్యర్థులు రిటర్నింగ్ అధికారిని కలసి విన్నవించారు.2013 నాటి ఎస్టీ ధ్రువపత్రాన్ని ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. థాట్రాజ్ ఎస్టీ కాదని హెకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రతులను ప్రత్యర్థి పార్టీ నేతలు ఆర్వోకు సమర్పించారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు అతని నామినేషన్ తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు.

థాట్రాజ్​ నామినేషన్​ను తిరస్కరించడంతో ఆయన తల్లి నరసింహ ప్రియ తెదేపా అభ్యర్థిగా బరిలో ఉండనున్నారు.

ఇదీ చదవండి

'వైకాపా, తెరాసకు బుద్ధి చెప్పాలి'

Last Updated : Mar 27, 2019, 10:06 AM IST

ABOUT THE AUTHOR

...view details