విజయనగరం అయోధ్య మైదానంలో ఆదివారం రాత్రి జరిగిన కాపలాదారుడు పెంటయ్య హత్య కేసును పోలీసులు 24 గంటల్లో చేధించారు. హత్య చేసిన ప్రసాద్, హేమంత్లను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు సంబంధించిన వివరాలు డీఎస్పీ వీరాంజినేయ రెడ్డి తెలిపారు. నిందితులు పెంటయ్య సన్నిహితులని వివరించారు. పాతకక్షలు, ఆర్థికపరమైన అంశాలే హత్యకు కారణమని తెలిపారు. మృతుడు పెంటయ్య దగ్గర ఉన్న 20 వేల రూపాయలను దొంగలించాలని ప్రసాద్, హేమంత్ ప్రణాళిక వేసుకుని హత్య చేశారన్నారు. సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం ప్రసాద్ చేసినట్లు వెల్లడించారు.
24 గంటల్లోనే నిందితులను పట్టుకున్న పోలీసులు - vijayanagaram
విజయనగరంలో జరిగిన హత్య కేసును పోలీసులు 24 గంటల్లో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు సంబంధించిన వివరాలను డీఎస్పీ వివరించారు. పాత కక్షలు, ఆర్థిక అంశాలే హత్యకు దారి తీశాయని తెలిపారు.
24 గంటల్లోనే నిందితులను పట్టుకున్న పోలీసులు