RTC Bus: ఆర్టీసీ బస్సు మాయం... అంతలోనే..! - ఆర్టీసీ బస్సు ఆచూకీ లభ్యం
09:29 August 09
RTC Bus: ఆర్టీసీ బస్సు మాయం... అంతలోనే..!
విజయనగరం జిల్లాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. వంగర గ్రామంలో ఆర్టీసీ బస్సు మాయం కావడం కలకలం రేపింది. అయితే కొంత సేపటికే దాని ఆచూకీ లభ్యం కావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. పాలకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును... నిన్న రాత్రి వంగర గ్రామంలో సిబ్బంది నిలిపి... అక్కడే నిద్రపోయారు. తెల్లవారి లేచి చూసేసరికి బస్సు మాయమైపోయింది. బస్సును ఎత్తుకెళ్లారంటూ.... ఆర్టీసీ డ్రైవర్ వంగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీసాలడోలపేట వద్ద ఆర్టీసీని పోలీసులు గుర్తించారు. బస్సును గుర్తించామని డిపో మేనేజర్, సీఐ ధ్రువీకరించడంతో... ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ ఊపిరి పీల్చుకున్నారు.
ఇవీ చదవండి: