అమరావతి భూములకు సంబంధించి ప్రభుత్వం విచారణ తుది దశకు చేరుకుందని...పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అప్పటి ప్రభుత్వ పెద్దలు అమరావతి భూములను బలహీన వర్గాల నుంచి అన్యాయంగా కొనుగోలు చేసినట్లు స్పష్టమైందన్నారు. విచారణ నివేదికలో సాంకేతిక అంశాల ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి బొత్స తెలిపారు. విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయంలో కోటి 48 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన అదనపు భవనాల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు.
కృష్ణా నదీ జలాల్లో ఏపీ వాటా విషయం గురించి విభజన చట్టంలోనే ఉందన్నారు. సీఎం జగన్..ఆ విషయంపై తెలంగాణ ప్రభుత్వ పెద్దలు, కేంద్ర పెద్దలకు పలుమార్లు చెప్పటం జరిగిందన్నారు. ఇప్పటికైనా కృష్ణా జలాల విషయంలో తెలంగాణ నేతలు ఆలోచించాలని మంత్రి బొత్స విజ్ఞప్తి చేశారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఉన్నామని.. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు చేతులు ముడుచు కూర్చోలేదని ఘాటుగా వ్యాఖ్యనించారు.