విజయనగరం కోటలో మాన్సస్ ట్రస్టు నూతన ధర్మకర్తల మండలి తొలి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులైన, పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, విజయనగరం శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి, సుప్రీంకోర్టు లాయర్ విజయ్ సొంది, ప్రముఖ విద్యావేత్త అరుణ్ కపూర్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. మాన్సస్ బోర్డు చైర్ పర్సన్ కుమారి సంచిత గజపతి రాజు ధర్మకర్తల సభ్యులు అందరికీ స్వాగతం పలికారు. వైరస్ నియంత్రణ కోసం నిరంతరం శ్రమిస్తున్న జిల్లా యంత్రాంగానికి కుమారి సంచిత గజపతి రాజు ధన్యవాదాలు తెలియజేశారు. మాన్సస్ కోటలో 5000 చదరపు గజముల భూమిని ...900పడకల క్వారంటైన్, రైతు బజార్ కోసం జిల్లా యంత్రాంగానికి అప్పగించినట్లు తెలిపారు. ట్రస్టు బోర్డు మెడికల్ కళాశాల స్థాపించేందుకు కృషి చేసిన ఆనంద గజపతిరాజు ఆశయాన్ని నెరవేర్చి నివాళులర్పించాలని తీర్మానించారు. మాన్సస్ విద్యా సంస్థలన్నింటిని డిండాన్ యూనివర్సిటీ స్థాయికి మార్చాలని నిర్ణయించారు.
మాన్సస్ ట్రస్టు నూతన ధర్మకర్తల మండలి తొలి సమావేశం - ఏపీలో లాక్‌డౌన్ వార్తలు
విజయనగరం మాన్సస్ ట్రస్టు నూతన ధర్మకర్తల మండలి తొలి సమావేశం, మాన్సస్ బోర్డు చైర్ పర్సన్ కుమారి సంచిత గజపతి రాజు ఆధ్వర్యంలో కోటలో గల కార్యాలయంలో జరిగింది. విద్య ప్రమాణాలు పెంచి మాన్సస్ విద్యాసంస్థలన్నింటిని డిండాన్ యూనివర్సిటీ స్థాయికి మార్చాలని నిర్ణయించారు..

మాన్సస్ ట్రస్టు నూతన ధర్మకర్తల మండలి తొలి సమావేశం