ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'హరిత రాయబారులను ప్రోత్సహించండి'

పల్లెలను పరిశుభ్రంగా మార్చేందుకు ప్రభుత్వం రూపొందించిన 'మనం-మన పరిశుభ్రత' కార్యక్రమాన్ని సాలూరు మండలంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా... ప్రతి ఇంటి నుంచి రోజుకి రెండు రూపాయల చొప్పున రాయబారులకు ఇచ్చి... వారిని ప్రోత్సహించాలని ఈవోపీఆర్డీ వర్మ విజ్ఞప్తి చేశారు.

పారన్నవలసలో మనం-మన పరిశుభ్రత కార్యక్రమం ప్రారంభం
పారన్నవలసలో మనం-మన పరిశుభ్రత కార్యక్రమం ప్రారంభం

By

Published : Jun 2, 2020, 6:18 PM IST

విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని పారన్నవలస, నార్లవలస గ్రామాల్లో 'మనం-మన పరిశుభ్రత' కార్యక్రమాన్ని ఈవోపీఆర్డీ వర్మ ప్రారంభించారు. ప్రతి ఇంటి నుంచి రోజుకి రెండు రూపాయలను హరిత రాయబారులకు ఇచ్చి వారిని ప్రోత్సహించాలని కోరారు.

చెత్త శుద్ధి నిర్వహణ కేంద్రాలకు హరిత రాయబారులు చెత్తను తీసుకొస్తారని... అక్కడి నుంచి సంపదను తయారు చేస్తారని ఉపాధి హామీ పథకం ఏపీవో సుశీల తెలిపారు. తద్వారా పంచాయతీకి ఆదాయం చేకూరేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.

ఇదీ చూడండి:'కరోనా'ను విస్మరించి మంత్రి పర్యటన.. నెటిజన్ల విమర్శలు

ABOUT THE AUTHOR

...view details