ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిల్లంగి నెపంతో యువకుడి హత్య - గుమ్మలక్ష్మీపురంలో మూఢనమ్మకాలు

విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో దారుణం చోటుచేసుకుంది. మూఢనమ్మకంతో కొండకూనేరు గ్రామానికి చెందిన కొందరు ఓ యువకుడిని పొట్టన పెట్టుకున్నారు. చిల్లంగి నెపంతో బారికి అనే యువకుడిని రాళ్లతో కొట్టి చితిపైన పడేశారు.

man kill with superstition at vijayanagaram district gumma laxmi puram
చిల్లంగి నెపంతో యువకుడి హత్య

By

Published : Jul 23, 2020, 7:10 AM IST

కాలంతో పోటీపడి అభివృద్ధి పరుగుపెడుతున్న రోజుల్లోనూ గిరిజన ప్రాంతాల్లో మూఢనమ్మకాలు వీడటం లేదు. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో జరిగిన దారుణ ఘటన ఇందుకు నిదర్శనం. చిల్లంగి నెపంతో ఒకరిని హత్యచేసి... కాలుతున్న చితిపై వేసి తగులబెట్టిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. .... గుమ్మలక్ష్మీపురం మండలంలో నెల్లికెక్కువ పంచాయతీ కొండకూనేరు గ్రామానికి చెందిన పల్లెరిక ప్రసాద్‌ (23) అనే యువకుడి కాలికి గాయమై ఈ నెల 11న అనారోగ్యంతో మృతి చెందారు. ప్రసాద్‌ మృతికి ఇదే గ్రామానికి చెందిన పల్లెరిక బారికి అలియాస్‌ మిన్నారావే కారణమని కుటుంబసభ్యులు అనుమానం పెంచుకున్నారు. ప్రసాద్‌ అంత్యక్రియలు పూర్తయ్యాక అందరూ ఇంటికి చేరుకున్నారు. కొంత సేపయ్యాక బారికిని శ్మశానవాటికకు తీసుకెళ్లి రాళ్లతో కొట్టి హతమార్చారు. అంతేకాకుండా మృతదేహాన్ని అప్పటికే కాలుతున్న చితిపై వేసి దహనం చేశారని ఎల్విన్‌పేట సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌కుమార్‌, ఎస్‌ఐ నారాయణరావు తెలిపారు.

మేనల్లుడి ఫిర్యాదుతో వెలుగులోకి..

గొడవల కారణంగా భార్య కొన్నేళ్ల కిందట వెళ్లిపోవడంతో బారికి ఒక్కరే ఉంటున్నారు. కుటుంబ సభ్యులెవరూ లేకపోవడంతో సంఘటన బయటకు పొక్కలేదు. డొంగరకెక్కువ గ్రామానికి చెందిన బారికి మేనల్లుడు వెంకటరమణ తన మామయ్య కనిపించలేదంటూ గాలిస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న కొండకూనేరు గ్రామస్థులు బారికిని చంపేశామని, గ్రామానికి వస్తే పెద్దల సమక్షంలో మాట్లాడుకుని రాజీ చేసుకుందామని అతనికి చెప్పారు. రాజీకి ఒప్పుకోని వెంకటరమణ ఎల్విన్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ నారాయణరావు ఆధ్వర్యంలో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. 17 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఇదీచదవండి: నడిరోడ్డుపై భార్య తల నరికి చంపిన భర్త

ABOUT THE AUTHOR

...view details