విజయనగరం జిల్లా ఎల్.కోట మండలం ఖాసాపేట గ్రామానికి చెందిన చొక్కాకుల నగేష్.. గత నెల 30న ఇంటి నుంచి పారిపోయి జామి మండలంలో గొర్లకాపర్లోతో కలిసి జీవాలను మేపుతున్నాడు. శనివారం గోస్తనీ నది పక్కన గొర్రెల మందను మేపుతుండగా నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నదిలో మునిగి యువకుడు మృతి - విజయనగరం జిల్లా క్రైం
గొర్రెలను మేపుతూ ప్రమాదవశాత్తు నదిలో మునిగి యువకుడు మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
నదిలో మునిగి యువకుడు మృతి