విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చింతపల్లికి చెందిన కోటి అనే వ్యక్తి... విద్యుత్ స్తంభం ఎక్కి వీరంగం సృష్టించాడు. తాను ఓ పాఠశాల బస్సు డ్రైవర్‌నని... అకారణంగా ఓ విద్యార్థి తండ్రి తనను కొట్టాడని... ఇలా ఊరుకుంటే రేపు వేరొకరు చేయి చేసుకుంటారని టవర్ ఎక్కాడు. ఇలాంటివి నివారించాలని... ప్రైవేటు బస్సు డ్రైవర్ల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశాడు. ఈ విషయం కోసం తన ప్రాణాలు సైతం లెక్కచేయనని హెచ్చరించాడు. అక్కడకు చేరుకున్న పోలీసులు అతన్ని ఒప్పించి కిందకు దించే ప్రయత్నం చేశారు. అయినా అతను వినలేదు. చివరకు ఆతని భార్యను తీసుకొచ్చి నచ్చజెప్పారు. ఆమె ఏడుస్తూ... ఫోన్‌లో మాట్లాడితే శాంతించి కిందికి దిగాడు.
విద్యార్థి తండ్రి కొడితే టవర్ ఎక్కాడు... భార్య బతిమలాడితే దిగాడు...
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చింతపల్లికి చెందిన కోటీ అనే వక్తి... ప్రైవేటు బస్సు డ్రైవర్ల సమస్యలు తీర్చాలని కోరుతూ... విద్యుత్ టవర్ ఎక్కాడు. భార్య ఏడ్చి... బతిమిలాడితే నాలుగు గంటల తర్వాత టవర్ దిగాడు.
టవర్ దిగుతున్న వ్యక్తి