ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రజల వద్దకే వ్యాధి నిర్ధరణ కేంద్రాలు - vizia nagaram

పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో మలేరియా నివారణకు అధికారులు నడుం బిగించారు. మలేరియా నివారణ దినోత్సవం సందర్భంగా వైద్యాధికారులు మలేరియా నిర్ధరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

మలేరియా కేంద్రాలు

By

Published : May 1, 2019, 3:38 PM IST

ప్రజల వద్దకే వ్యాధి నిర్ధరణ కేంద్రాలు

విజయనగరం జిల్లా పార్వతీపురం పరిధిలో మలేరియా నివారణకు అధికారులు వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలైన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో వ్యాధి నిర్ధరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మలేరియా నివారణ దినోత్సవం సందర్భంగా పరీక్షలు చేస్తున్నారు. ప్రయాణికుల నుంచి రక్త నమూనాలను సేకరించి క్షణాల్లో ఫలితాలు వెల్లడిస్తున్నారు. వ్యాధి ఉన్నట్టు తేలితే వెంటనే మందులను అందిస్తున్నారు. ప్రయాణికులు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details