గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పంచాయతీల వారీగా ఓటరు జాబితా తయారీపై విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో నియోజకవర్గ స్థాయి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి బి సత్యనారాయణతోపాటు ఐదు మండలాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల ఓటరు జాబితా సేకరించి వార్డులవారీగా విభజించాలని జిల్లా పంచాయతీ అధికారి సూచించారు. మే 10వ తేదీలోగా పూర్తి చేసిన ఓటరు జాబితాను ప్రకటించాల్సి ఉంటుందన్నారు. అవసరమైతే గ్రామ పంచాయతీ పరిధిలో వీఆర్వోల సహకారం తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.
'పంచాయతీ ఎన్నికలకు ఓటరు జాబితా సిద్ధం చేయండి' - elections
గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పంచాయతీల వారీగా ఓటరు జాబితా సిద్ధం చేయాలని విజయనగరం జిల్లా పంచాయతీ అధికారి సిబ్బందికి సూచించారు.
కార్యదర్శులకు శిక్షణా కార్యక్రమం