ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫేస్‌బుక్‌ ప్రేయసి కోసం ఇంట్లోనే గుడికట్టిన ప్రేమికుడు - ఫేస్​బుక్ ప్రేయసి కోసం గుడి వార్తలు

ఎక్కడైనా జాతీయ, దేశ నాయకుల గుర్తుగా వారి విగ్రహాలు ఏర్పాటు చెయ్యడం చూస్తాం. జన్మమిచ్చారనే మమకారంతో తల్లిదండ్రుల ప్రతిమలకూ పూజలు చేస్తుంటారు. విజయనగరం జిల్లా జామికి చెందిన కడియాల ఎర్నిబాబు మాత్రం తన ప్రేయసి కోసం గుడి కట్టి ప్రేమ పూజలు చేస్తున్నాడు.

lover-statue-in-vizianagaram

By

Published : Nov 21, 2019, 3:02 PM IST

ఫేస్‌బుక్‌ ప్రేయసి కోసం ఇంట్లోనే గుడికట్టిన ప్రేమికుడు

ఎర్నిబాబు వృత్తిరీత్యా ఎలక్ట్రికల్‌ మెకానిక్‌.ఫేస్‌బుక్‌ ద్వారా ముంబయికి చెందిన ఓ యువతి పరిచయమైంది.ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది.హైదరాబాద్‌లో చాలా సార్లు కలుసుకున్నారు.ఊసులెన్నో చెప్పుకున్నారు.

ఏడాది క్రితం ఆ యువతి చనిపోయింది.అప్పటి నుంచి తీవ్ర వేదనలో మునిగిపోయాడు.తరచు తనకు కలలో కనిపిస్తోందంటూ...కనిపించేవారందరికీ చెప్పేవాడు.

అందుకే ఆమె జ్ఞాపకార్థం ఇంటి మేడపై ఓ గదిలో విగ్రహప్రతిష్ఠ చేశాడు.ఆ ఉత్సవాన్ని జామిలో అట్టహాసంగా నిర్వహించాడు.సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాడు.సుమారు300మందికి భోజనాలు పెట్టాడు.

వీరిద్దరి ప్రేమ సంగతి తెలిసిన అమ్మాయి తల్లిదండ్రులే విగ్రహాన్ని పంపించారు.ఎర్నిబాబు జీవితంలో స్థిరపడాలని...ఆమె ప్రేమ జ్ఞాపకాల నుంచి బయట పడేసేందుకు ఇరు కుటుంబాలు చేయని ప్రయత్నం లేదు.

ఇవి కూడా చదవండి:

పింక్ టెస్టుతో పెద్ద పండగే: గంగూలీ

ABOUT THE AUTHOR

...view details