విజయనగరం జిల్లా సంతకవిటి మండలం గొల్ల వలసలో ఉపాధి హామీ కూలీలను కొండచిలువ పరుగులు పెట్టించింది. ఉపాధిహామీ కూలీలు చెరువులో పూడిక పనులు చేస్తుండగా.. 12 అడుగుల పొడవున్న కొండచిలువ కనిపించింది. భయాందోళనకు గురైన కూలీలు తలో దిక్కుకు పరుగులు తీశారు. ఆ తర్వాత కొందరు కర్రలతో కొండచిలువను చంపేశారు. 12 అడుగులు ఉన్నఈ కొండచిలువను చూసేందుకు గొల్లవలసతో పాటు చట్టుపక్కల గ్రామస్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.
12 అడుగుల భారీ కొండచిలువ.. భయంతో కూలీల పరుగు - భారీ కొండ చిలువ న్యూస్
విజయనగరం జిల్లా గొల్లవలసలో ఉపాధి హామీ కూలీలను కొండచిలువ పరుగులు పెట్టించింది. చెరువులో పూడిక పనులు చేస్తుండగా 12 అడుగుల కొండచిలువ కనిపించింది. దీంతో కూలీలు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు.
12 అడుగుల భారీ కొండచిలువ