విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం ఆర్కే బట్టి వలస సమీపంలో పోలీసులు రెండు లక్షల విలువైన ఖైని, గుట్కాను పట్టుకున్నారు. ఒడిశా నుంచి బొలెరో వాహనంలో బస్తాల్లో వీటిని తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా వంగర మండలం ఎం సీతారాంపురం ప్రాంతానికి ఈ సరకును తీసుకెళ్తున్నట్టు పోలీసులు చెప్పారు. గుట్కాను రవాణా చేస్తున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై వీరబాబు సిబ్బందితో దాడి చేసి వాహనాన్ని తనిఖీ చేశారు. గుట్కా ఉన్నట్టు గుర్తించి రవాణాదారులను అరెస్ట్ చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
గుట్కాను తరలిస్తున్న ఇద్దరు నిందితుల అరెస్టు - police
విజయనగరం జిల్లా ఆర్కే బట్టివలస వద్ద నిషేధిత గుట్కాలను తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. రెండు లక్షల విలువైన ఖైని, గుట్కా ను స్వాధీనం చేసుకున్నారు.
ఖైనీ, గుట్కా పట్టివేత