ఇస్త్రీ చేసి... డప్పుకొట్టి... ఓట్ల కోసం ఫీట్లు - different
ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు. తాాజాగా జనసేన ఎంపీ అభ్యర్థి ఇస్త్రీ చేయగా, ఎమ్మెల్యే అభ్యర్థి డప్పు కొట్టారు.
ఇస్త్రీ చేస్తున్న శ్రీనివాసరావు
By
Published : Apr 2, 2019, 9:12 AM IST
వినూత్న ప్రచారం
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా విజయనగరంలో పలు రాజకీయ పార్టీల అభ్యర్థులు పోటా పోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు వినూత్న తీరులో ప్రచారం కల్పిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి ముక్కా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే అభ్యర్థియశస్వీ ఇద్దరూ కలిసి విజయనగరం పట్టణంలోని జొన్నగుడ్డి ప్రాంతంలో ప్రచారం నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి ఇస్త్రీ చేయగా... ఎమ్మెల్యే అభ్యర్ధిని యశస్వీ... డప్పుకొట్టికార్యకర్తల్లో ఉత్సాహం పెంచారు. ఇంటింటికీ వెళ్లి గ్లాసు గుర్తుకు ఓటేయాలని కోరారు.