జగన్ లోటస్‌పాండ్‌లో ఉంటేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన...మోదీ, కేసీఆర్, జగన్ రూపంలో రాష్ట్రంపై మూకుమ్మడి దాడి జరుగుతుందన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకునే శక్తి ప్రజలకు ఉందన్న సీఎం..ఏపీకి అన్యాయం జరిగిందని పవన్ పెద్దపెద్ద మాటలు మాట్లాడారన్నారు. కేసీఆర్ ఏం చేసినా పవన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రకృతి సేద్యంలో విజయనగరం జిల్లా ఆదర్శంగా నిలిచిందన్న చంద్రబాబు... విజయనగరం జిల్లాకు పతంజలి పరిశ్రమ వస్తోందన్నారు. భోగాపురం విమానాశ్రయంతో విజయనగరం దశా, దిశమారుతుందన్న సీఎం..బొత్స సత్యనారాయణ వస్తే మళ్లీ కష్టాలు తప్పవన్నారు. సుస్థిరమైన ప్రభుత్వం ఉంటేనే రాష్ట్రం ముందుకెళ్తుందని..చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
'జగన్ లోటస్‌పాండ్‌లో ఉంటేనే మేలు' - చీపురుపల్లి
విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు... జగన్ లోటస్‌పాండ్‌లో ఉంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. భోగాపురం విమానాశ్రయంతో విజయనగరం జిల్లా దశా, దిశ మారుతుందని సీఎం తెలిపారు.
విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రచారం