విజయనగరం జిల్లా గరివిడి శ్రీ వెంకటేశ్వర పశువైద్య పరిశోధన కళాశాలలో విద్యార్థులు వెయ్యి మెుక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. కలెక్టర్ హరి జవహర్లాల్ ఆదేశాల మేరకు కళాశాల అసోసియేట్ డీన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మెుక్కల పెంపకం ద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుందని కళాశాల డీన్ వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మెుక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
'సామాజిక బాధ్యతగా మెుక్కలు పెంచాలి' - vizayanagaram
గరివిడి శ్రీ వెంకటేశ్వర పశువైద్య పరిశోధన కళాశాలలో విద్యార్థులు ఒకేరోజు వెయ్యి మెుక్కలను నాటారు.
మెుక్కలు నాటుతున్న విద్యార్థులు