విజయనగరం జిల్లా పాచిపెంట మండల పరిధిలో ఉన్న కోన వలస చెక్ పోస్ట్ వద్ద గంజాయి రవాణా వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పోలీసులను చూసి డ్రైవర్ పరారవడంతో ఆ వాహనాన్ని పాచిపెంట పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి పరిశీలించారు.ఖాళీ ప్లాస్టిక్ ట్రేలు పేర్చి మధ్యలో గంజాయిని రవాణ చేస్తున్నారని పోలీసులు గుర్తించారు.సుమారు900కేజీల గంజాయి ప్యాకెట్లు ను వారు స్వాధీనం చేసుకున్నారు.త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఇంచార్జ్ ఎస్ఐ సత్యనాయుడు తెలిపారు.
గంజాయి వాహనాన్ని పట్టుకున్న పోలీసులు - విజయనగరం
విజయనగరం పాచిపెంటలో గంజాయి రవాణా చేస్తున్న వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 900 కేజీల గంజాయి ఆ వాహనంలో ఉందని పోలీసులు తెలిపారు.
గంజాయి వాహనాన్ని పట్టుకున్న పోలీసులు
Last Updated : Aug 20, 2019, 5:43 PM IST