ఆలూరులో కులమతాలకు అతీతంగా "ఇఫ్తార్" - iftar
ఆలూరులో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. కులమతాలకు అతీతంగా నమాజ్ చేసి తమ ఐక్యతను అతిథులు చాటుకున్నారు. అనంతర ఏఎస్పీ నరసింహరావును సత్కరించారు.
'ఆలూరులో ఘనంగా ఇఫ్తార్ విందు కార్యక్రమం'
విజయనగరం జిల్లా ఆలూరులోని సత్య సాయి కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఎస్పీ దామోదర్, అడిషనల్ ఎస్పీ నరసింహారావు, ఓఎస్డీ, ఏఎస్పీ, మెజిస్ట్రేట్, సిఐ సయ్యద్ మహమ్మద్ పాల్గొన్నారు. ఇప్తార్ విందులో కుల, మతాలకు అతీతంగా నమాజ్ చేసి తమ ఐకమత్యాన్ని చాటుకున్నారు. అనంతరం అడిషనల్ ఎస్పీ మంచాల నరసింహారావుకు ఎస్పీ చేతుల మీదుగా సన్మానం చేశారు. అనంతరం నరసింహరావుతో తమకున్న అనుభవాన్ని పోలీసు సిబ్బంది పంచుకున్నారు.