ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆంధ్రా - ఒడిశా సరిహద్దు గ్రామాల్లో మళ్లీ ఉద్రిక్తత - విజయనగరం జిల్లా వార్తలు

ఆంధ్రా - ఒడిశా సరిహద్దులోని వివాదాస్పద గ్రామాల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫలితంగా స్థానిక అధికారులు తలపెట్టిన పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేశారు. ఒడిశా అధికారులు గ్రామాల్లో భారీగా పోలీసులను మోహరించారు.

ఆంధ్ర ఒడిశా సరిహద్దు
ఆంధ్ర ఒడిశా సరిహద్దు

By

Published : Aug 16, 2021, 6:16 PM IST

ఆంధ్ర - ఒడిశా సరిహద్దు వివాదాస్పద గ్రామాల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివాదాస్పద గ్రామాల్లో ఒకటైన పట్టు చెన్నూరులో సోమవారం పట్టాల పంపిణీ, భవనాల శంకుస్థాపన కార్యక్రమాలను ఎమ్మెల్యే రాజన్న దొర.. ఐటీడీఏ పీవో కలిసి వెళ్లి నిర్వహించాలనుకున్నారు. కానీ.. సమాచారం తెలుసుకున్న ఒడిశా అధికారులు, ప్రజా ప్రతినిధులు ముందు ఆ గ్రామానికి వచ్చి బారికేడ్లు ఏర్పాటు చేశారు. రెండు వందల మంది పోలీసులతో గ్రామంలోకి వచ్చే ప్రతి ఒక్కరినీ అడ్డుకున్నారు. పంచాయతీ సెక్రటరీ, సచివాలయ ఉద్యోగులు వెళ్లినప్పుడు అడ్డుకోవడంతో సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఆ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు చెప్పారు. ఫలితంగా ఎమ్మెల్యే తన పర్యటనను రద్దు చేసుకున్నారు.

ఆ గ్రామాల్లో ఎన్నో సంవత్సరాలుగా స్టేటస్ ​కో అమలులో ఉందని, ఆ గ్రామాల్లో ఒడిశా అధికారులు అక్రమంగా ఆంధ్రా అధికారులను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని ఎమ్మెల్యే ఆర్పీ, మాజీ ఎమ్మెల్సీ సంధ్యారాణి అన్నారు. ఎమ్మెల్యే రాజన్నదొర మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడం తోనే తాము కార్యక్రమానికి వెళ్లకుండా ఆగిపోయాయని, వారి మాటల గౌరవించాలని ఉద్దేశంతోనే కార్యక్రమానికి వెళ్లలేదని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:ఆహ్వానం ఎందుకు పంపలేదు.. టీచర్లపై వైకాపా నేత తిట్ల పురాణం

ABOUT THE AUTHOR

...view details