ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భారీ వర్షం... తప్పిన ప్రమాదం - today rain news in ap

విజయనగరం జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కురిసిన వానతో వీధులన్నీ జలమయమయ్యాయి. కోటారుబిల్లిలో గాలివానకు ఆటోపై చెట్టు కూలింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.

heavy rain in vizianagaram district
heavy rain in vizianagaram district

By

Published : Jun 4, 2020, 1:36 PM IST

Updated : Jun 4, 2020, 3:21 PM IST

విజయనగరం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కొత్తవలస, గంట్యాడ, బొండపల్లిలో మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురిసింది. గంట్యాడ మండలం కోటారుబిల్లిలో... గాలివానకు ఆటోపై తాటిచెట్టు కూలిపోయింది. ఆటోలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

విజయనగరం పట్టణంలో పలుచోట్ల ఈదురు గాలులతో... భారీ వర్షం కురిసింది. వానతో వీధులన్నీ జలమయమయ్యాయి. మురుగు కాలువలు పొంగిపొర్లాయి. ఇన్ని రోజులు ఎండతో ఉక్కిరిబిక్కరి అయిన ప్రజలు...ఈ వానతో కాస్త ఉపశమనం పొందారు.

చీపురుపల్లి, మెంటాడ, తెర్లాం, కురుపాం, ఎస్.కోటలో తేలికపాటి జల్లులు కురిశాయి. సాలూరులోని డీలక్స్ కూడలిలో ఈదురుగాలికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది.

ఇదీ చదవండి:విశాఖలో పలుప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం

Last Updated : Jun 4, 2020, 3:21 PM IST

ABOUT THE AUTHOR

...view details