విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటిడిఏ సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి సమస్యలు వెల్లువెత్తాయి. నెలలో నాలుగో సోమవారం కావటంతో కలెక్టర్ హరిజవహర్‌లాల్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ డే నిర్వహించారు. వినతులు ఇచ్చేందుకు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే గిరిజన ప్రాంత ప్రజలకు దూరాభారం అవుతుందని నెలలో ఒక రోజు ఐటిడీఏలో గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారు. ఎన్నికల హడావిడి కారణంగా కలెక్టర్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించలేదు. ఎన్నికల ముగిసిన తర్వాత తొలిసారిగా నిర్వహించటంతో పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. విభాగాల వారిగా జిల్లా అధికారులు హాజరయ్యారు. కలెక్టర్ వినతులు స్వీకరించి సంబంధిత అధికారులకు అందజేశారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఐటీడీఏ పీవో లక్ష్మీ ఉపకలెక్టర్ చేతన్ ఇతర జిల్లా అధికారులు హాజరయ్యారు.
గ్రీవెన్స్ డేలో వెల్లువెత్తిన వినతులు - monday
విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటిడీఏ మందిరంలో గ్రీవెన్స్ డే నిర్వహించారు. నెలలో నాలుగో సోమవారం కావటంతో కలెక్టర్ ఇక్కడకు వచ్చి వినతులు స్వీకరించారు.
గ్రీవెన్స్ డే