విజయనగరం జిల్లాలోని జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల పరిధిలో.. లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు. సాగర్ ఎడమ కాలువ జోన్ 2 పరిధిలోని డీవీఆర్ బ్రాంచ్ కాలువకు ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, గౌరవరం రెగ్యులేటర్ నుంచి గేట్లు ఎత్తి నీటిని వదిలారు. పదేళ్ళ తర్వాత కృష్ణా జలాలు సమృద్ధిగా వచ్చాయని...ఈ నీటిని రైతులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముందుగా రెండు నియోజకవర్గాల్లోని సుమారు 50 చెరువులను నింపి సాగునీరు అందిస్తామని... నాగార్జునసాగర్ డ్యాంలో పూర్తిస్థాయిలో నీరు ఉన్నందున రెండు నియోజకవర్గాలకు ఈ ఏడాది మెట్ట, మాగాణి పైర్లకు పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తామని తెలిపారు.
''మెట్ట, మాగాణి పైర్లకు పూర్తిస్థాయిలో సాగునీరు'' - nagarjuna sagar dam
విజయనగరం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో సాగునీరు అందించేందుకు నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల చేశారు. ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల జగన్ మోహన్ రావు, గౌరవరం రెగ్యులేటర్ నుంచి గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు.
నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల