వర్షాల కోసం కప్పలకు పూజలు...ఊరేగింపు
వర్షాలు కురవాలంటూ కప్పల పండుగ సంబరంగా చేస్తున్నారు. వాటికి పూజలు చేసి ఊరేగించారు. ఈ పండుగ చేస్తే తప్పనిసరిగా వర్షాలు కురుస్తాయని ప్రజల నమ్మకం.
frog-festival-in-vizianagaram
విజయనగరం జిల్లా మెంటాడ గ్రామస్థులు వర్షాలు కురవాలంటూ కప్పల పండుగ నిర్వహించారు. కప్పకు పసుపు, కుంకుమతో పూజలు చేసి రాగి బిందెలో నీటితో ఊరేగించారు. పిల్లలు, పెద్దలు కలసి పాటలు పాడుతూ ఊరేగింపులో పాల్గొన్నారు. వరినాట్లు వేసి సుమారు నెల రోజులు పూర్తయిందని....., ఇంతవరకు చినుకు జాడేలేదని గ్రామస్థులు వాపోయారు. గత పదిహేనేళ్ల నుంచి ఇంతటి కరవు చూడలేదన్నారు. కప్పల పండుగ చేస్తే.... తప్పనిసరిగా వర్షాలు పడతాయనే నమ్మకంతో పూజలు చేస్తున్నట్లు వివరించారు.