ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బొండపల్లిలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు - bondapally

విజయనగరం జిల్లా బొండపల్లి గ్రామాన్ని దత్తత తీసుకొని సబ్సిడీపై వైద్యాన్ని అందిస్తామని శ్రీసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం ప్రకటించింది.

బొండపల్లిలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు

By

Published : May 12, 2019, 4:25 PM IST

విజయనగరం జిల్లా గరివిడి మండలం బొండపల్లిలో ఈ రోజు శ్రీ సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. గ్రామస్తులకు పలు రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీరామ్ మూర్తి మాట్లాడుతూ... శ్రీ సాయి స్వచ్ఛంద సేవా సంస్థ, శ్రీవివేకనంద సేవా సంస్థల సహకారంతో బొండపల్లి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. గ్రామంలోని వ్యాధి గ్రస్తులకు 50 శాతం సబ్సిడీతో మేజర్ ఆపరేషన్లు, ఎక్స్​రేలు తీస్తామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్తులకు సూచించారు.

బొండపల్లిలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు

ABOUT THE AUTHOR

...view details