ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అత్తింటికి తీసుకెళ్తానని చెప్పి.. కుమార్తెపై అత్యాచారం చేశాడు! - కుమార్తెపై తండ్రి అత్యాచారం వార్తలు

కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కీచక తండ్రి వావివరుసలు మరిచి కన్న కూతురిపై అత్యాచారం చేశాడు. తన తండ్రి చేసిన ఘాతకంపై ఆ కూతురు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.

అత్తింటికి తీసుకెళ్తానని చెప్పి.. కుమార్తెపై అత్యాచారం చేశాడు!
అత్తింటికి తీసుకెళ్తానని చెప్పి.. కుమార్తెపై అత్యాచారం చేశాడు!

By

Published : May 30, 2021, 10:00 AM IST

కంటికి రెప్పలా కాపాడుతాడనుకున్న కన్న తండ్రే ఆ బాలిక పాలిట కాలనాగయ్యాడు. కుమార్తెపై తండ్రి అత్యాచారానికి పాల్పడిన ఘటన విజయనగరం జిల్లాలోని ఓ గిరిజన గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గిరిజన గ్రామానికి చెందిన బాలిక (15) పదో తరగతి చదువుతోంది.

ఆమె తండ్రి.. అత్తింటికి తీసుకెళ్తానని నమ్మించి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం కుటుంబ సభ్యులకు తెలపడంతో వారి సహకారంతో బాధితురాలు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి తండ్రిపై ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిపై పోక్సో, అత్యాచారం కేసులు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఇంతకు ముందు నిందితుడిపై హత్యానేరం కేసు ఉందని పోలీసులు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details