ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎరువుల కోసం రైతుల తంటాలు.. అవసరానికి దొరకకపోవడంపై నిరాశ - farmers over fertilizers shortage

వర్షాలు అనుకూలించాయి. పంట ఆశాజనకంగా ఉంది. ఈ పరిస్థితుల్లో గతం కంటే మెరుగైన దిగుబడులు రావచ్చని రైతన్న కలలు కన్నాడు. కానీ ఆ కలలు కళ్లలయ్యేలా ఉన్నాయి. పంట కీలక దశలో ఎరువులు లభించక విజయనగరం జిల్లాలో రైతులు విలవిల్లాడుతున్నాడు.

ఎరువుల కోసం రైతుల తంటాలు
ఎరువుల కోసం రైతుల తంటాలు

By

Published : Oct 15, 2021, 9:45 PM IST



విజయనగరం జిల్లాలో ఖరీఫ్‌లో ప్రధాన పంట వరి. ఈ ఏడాది వర్షాలు అనుకూలించటంతో సాధారణ విస్తీర్ణం కంటే ఎక్కువగానే వరి సాగైంది. పంట ప్రస్తుతం చిరుపొట్ట దశకు చేరుకుంది. ఈ తరుణంలో జిల్లా రైతుల్ని ఎరువుల కొరత వేధిస్తోంది. రైతు భరోసా కేంద్రాల్లోనూ ఎరువులు దొరకడం లేదు. పొటాష్ ఎరువుల కోసం రైతులకు నిరాశే ఎదురవుతోంది.

ఎరువుల కోసం రైతుల తంటాలు.. అవసరానికి దొరకకపోవడంపై నిరాశ

ప్రస్తుత దశలో వరి పంటకు కాంప్లెక్స్ ఎరువులు వేయకపోతే.. దిగుబడి, నాణ్యత తగ్గిపోవటంతో పాటు తెగుళ్లు వ్యాపిస్తాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. కానీ..... ప్రభుత్వ కేంద్రాల్లో ఎక్కడా పొటాష్ ఎరువు అందుబాటులో లేకపోవటంతో... రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. వ్యవసాయశాఖ.. ఎరువులని అందుబాటులో ఉంచకపోవటంపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి.

పొటాష్ ఎరువుల కొరతపై వ్యవసాయశాఖ అధికారులు వివరణ ఇస్తూ..జిల్లాలో ఖరీఫ్‌కు 10వేల మెట్రిక్ టన్నుల లక్ష్యం కాగా..... ఇప్పటి వరకు 6 వేల125 మెట్రిక్ టన్నులు వచ్చిందన్నారు. మిగిలిన కేటాయింపు కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదించామని చెబుతున్నారు. రైతులకు అవసరమైన యూరియా, డీఏపీ అందించడంలో.... జిల్లా అధికారులకు ప్రణాళికలు లేకపోవడమే సమస్యకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ చదవండి:

PROTEST: నష్టపరిహారం కోసం భూనిర్వాసితుల ఆందోళన.. పోలీసుల అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details