ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయనగరం ఎంపీతో భారత్​ ముఖాముఖి - face to face

అనూహ్య రీతిలో విజయనగరం ఎంపీగా ఎన్నికయ్యారు వైకాపా నేత బెల్లాన చంద్రశేఖర్. మొదటి సారిగా పార్లమెంట్​లో అడుగుపెడుతున్న బెల్లాన... రాష్ట్ర, జిల్లా సమస్యలపై ఎలా వాణి వినిపిస్తారో ఆయన మాటల్లో

విజయనగరం ఎంపీతో భారత్​ ముఖాముఖి

By

Published : Jun 6, 2019, 1:37 PM IST

రాజకీయ వైకుంఠ పాళిలో వడివడిగా నిచ్చెనలెక్కి., పీఠాన్ని అధిష్టించేందుకు వ్యూహ, ప్రతి వ్యూహాలు, ఎత్తుకు పైఎత్తులు మాత్రమే సరిపోవు. అదృష్టం, అవకాశం కూడా కలసి రావాలి. విజయనగరం లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికైన బెల్లాన చంద్రశేఖర్ ఇటువంటి అనుహ్య విజయాన్ని అందుకున్నారు. గతంలో జిల్లా పరిషత్తు ఛైర్మన్ గా, ప్రస్తుతం విజయనగరం పార్లమెంటు ఎంపీగా ఎన్నికైన సందర్భాల్లోనూ ఆయనకు అవకాశం, అదృష్టం రెండూ కలసి వచ్చాయి. నిజానికి సార్వత్రిక ఎన్నికల్లో బెల్లాన చంద్రశేఖర్ చీపురుపల్లి నుంచి ఎమ్మెల్లేగా పోటీచేసి అసెంబ్లీలో వాణి వినిపించాలని ఆశించారు. ఆ దిశగానే ప్రయత్నాలు చేశారు. కానీ... అనుకోని రీతిలో లోక్‌సభ స్థానానికి పోటీపడాల్సి వచ్చింది. ఇక బరిలో రాజకీయ ఉద్దండునితో తలపడ్డారు. చివరకి అందరి అంచనాలను తారుమారు చేసి సంచలన విజయాన్ని అందుకొని తొలిసారిగా పార్లమెంటులో అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో విజయనగరం ఎంపీగా గెలుపొందిన బెల్లాన చంద్రశేఖర్ తో ముఖాముఖీ...

విజయనగరం ఎంపీతో భారత్​ ముఖాముఖి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details