ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దర్జీ కూతురు...విద్యా 'కుసుమం' - వేమన కుసుమ

పేదింట్లో పుట్టినా..చదువునే నమ్ముకుని రాష్ట్ర స్థాయిలో డీఎస్సీ పరీక్ష ఎస్జీటీ విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది విజయనగరం జిల్లా ధర్మవరం గ్రామానికి చెందిన వేమన కుసుమ.

దర్జీ కూతురు...విద్యా 'కుసుమం'

By

Published : Feb 17, 2019, 6:52 AM IST

వేమన కుసుమ విజయ ప్రస్థానం
ఆడవాళ్లంటే భారంగా భావించే ఎందరికో.. ఇప్పుడు తనో సమాధానం...మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తారని చెప్పడానికి ఆమె ఓ ఉదాహరణ.. పోటీ పరీక్షల్లో తను సాధించే మార్కులు ఎవ్వరకీ అందనంతా ఎత్తులో ఉంటాయి. టెన్త్ ఫలితాల నుంచి తాజాగా విడుదలైన డీఎస్సీ-ఎస్టీటీ పరీక్షల ఫలితం వరకూ.. అన్నింట్లో తనే నెంబర్ వన్...ఆమె విజయ నగరం జిల్లా శృంగవరపు కోట మండలం ధర్మవరం గ్రామానికి చెందిన వేమన కుసుమ.
కుసుమ తండ్రి వృత్తి రీత్యా దర్జీ... ముగ్గురు ఆడపిల్లల్లో కుసుమ రెండో సంతానం... చిన్నప్పటి నుంచి పేదరికం అంటే బాగా తెలియడం వలన బాగా చదవాలనుకుంది. నాలుగో తరగతి నుంచే చదువుల్లో ఉత్తమంగా ఉండేది...ఇది గుర్తించిన ఉపాధ్యాయులు ఆమెకు ఎల్లవేళలా అండగా నిలిచారు. తాటిపూడి గురుకుల పాఠశాలలో విద్యాభ్యాసం కొనసాగించి ...పదో తరగతి ఫలితాల్లో ప్రథమ స్థానంలో నిలిచింది.
చిన్నప్పటి నుంచి తనను ఆదుకున్న ఉపాధ్యాయుల్లా కుసుమ టీచరు వృత్తిని చేపట్టాలనుకుంది . అందుకు అనుగుణంగా నెల్లిమర్ల ప్రభుత్వ డీఈడీ కళాశాలలో సీటు సంపాదించి...2016లో టీచరు కోర్సు పూర్తి చేసింది. అప్పటి నుంచి ఆమె మహాయజ్ఞం ప్రారంభమైంది. . డీఎస్సీ కోసం సాధన ప్రారంభించింది. 2018లో జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష...టెట్​లో 146 మార్కులు సాధించి ...రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించింది.
తల్లిదండ్రుల కష్టం గుర్తించిన కుసుమ...టెట్ ఫలితాలు అందించిన ఉత్సాహంతో మరింత సాధన పెంచింది. డీఎస్సీ కోసం రోజుకి 15 గంటలు శ్రమించింది . తాజాగా విడుదలైన డీఎస్సీ-2018 ఫలితాల్లో ఎవ్వరికీ అందనంతా ఎత్తులో 91 మార్కులతో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సంపాదించింది.
కుసుమ ఎందరికో ప్రేరణగా నిలుస్తుందని అందరూ అంటుంటే.... ఎంతో సంతోషంగా ఉందని కుసుమ తల్లిదండ్లులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి చదవడం కంటే ..ఇష్ట పడి చదివితేనే అనుకున్నది సాధించవచ్చంటున్న కుసుమ...భవిష్యత్తులో సివిల్స్ ర్యాంకు సాధించడమే తన లక్ష్యమంటోంది.

ABOUT THE AUTHOR

...view details